సాయీ నీవే జీసస్ !
శ్రీసాయినాథాయనమః
" శ్రీసాయిలీలలకు జాతి,దేశ,మత భేదాలు లేవు. మొదట నేను షిరిడీ దర్శించాక, సశరీరులైన సద్గురుని కోసం అన్వేషిస్తూ 1968 లో జిల్లెళ్ళమూడిలో కొంతకాలమున్నాను. అపుడకడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడీ దర్శించాలనుకొన్నది. కాని అకస్మాత్తుగ ఆమె తల్లికి జబ్బుచేయడం వలన ఆమె వెంటనే తనదేశానికి బయలుదేరుతూ, నాతో, " బాబాలో శక్తిలేదు. నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను! " అన్నది. కాని బొంబాయిలొ తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటల పాటు ఆగిపోయాయి. అపుడామె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి, బాబామహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది.
ఆమె సాయిని దర్శించి, అమెరికా చేరి యిలా వ్రాసింది. " బాబా నాకు డిసెంబరు 1, న కలలో కన్పించారు. నాటినుండీరోజుకు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటినుండి ఆయన నాకు " బాబా క్రీస్తు! " ..... ఇట్లు సోదరి మార్వా. " శ్రీసాయిలీలామృతము ( నిత్యసత్యుడు, పేజీ 142 ), పూజ్యశ్రీ భరద్వాజ
కరుణామయులు
హే .. హే ... హే .... హే ..; హే హే..
హేహే సాయీశ జీసస్ నీవయ్య
ధరణి కరుణను నింప అవతరించావయ్య
అవతరించావయ్య అవతరించావయ్య
కరుణమూర్తిగ మమ్ము కనికరించావయ్య
పావన జన్మమె నీది నీదయ్య
పరమేశుపుత్రుగ అవతరించావయ్య
పరలోక శాంతినే పదుగురుకు పంచగ
ప్రభువాక్య పాలనకు అవతరించావయ్య || హేహే సాయిశా ||
సైతాను రాజ్యమె సాగుసాగూవేళ
ప్రేమానురాగాలె మృగ్యమైనావేళ
చీకటుల బాపంగ అవతరించావయ్య
శతకోటి కాంతులను ఎదల నింపావయ్య || హేహే సాయిశా ||
పాపాల తాపాల పీడపెరిగిన వేళ
దీనులకు హీనులకు దిక్కు దోచని వేళ
వ్యాధులు బాధలు దేహాన ధరియించి
హాలాహలము నీవె మ్రింగావయ్య || హేహే సాయిశా ||
ఎల్లలేమీలేక ఎల్లరను ప్రేమించి
నీదు హితమును మరిచి మహిమ జూపావయ్య
మహిమ జూపావయ్య మహిమ జూపావయ్య
శిలను పొందిన పగిధి హితము మరిచావయ్య || హేహే సాయిశా ||
ప్రేరణ: క్రిస్ట్మస్ పండుగ రోజు
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
ప్రేరణ: క్రిస్ట్మస్ పండుగ రోజు
సాయిబాబా, జీసస్ లు దైవదూతలు, దయాసముద్రులు!
ReplyDelete