షిరిడియె అందాల బృందావనం
శ్రీసాయినాథాయనమః
బూటీవాడాలో మురళీధరుని స్థానంలో శ్రీసాయినాథుల భౌతిక దేహాన్ని సమాధి చేసారు కావున సాయి మురళీధరులు.,అందుచే షిరిడీ సాయిభక్తులకు పావన బృందావనము.
" శిరిడీ మావంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక , కాశి , రామేశ్వరము, బదరీకేదార్ , నాశిక్, త్ర్యంబకేశ్వరము , ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములవంటి దయినది." శ్రీసాయిసచ్చరిత్రము, 4వ అధ్యాయము
షిరిడియె అందాల బృందావనం
షిరిడియె అందాల
బృందావనం
సాయినాథుడె
నెలవున్న దేవాలయం
భక్తులపాలిట
ఇల వైకుంఠము
లీలామానుష
కృష్ణ విహారము
భూకైలాసము
శివుని వాసము
కాశీనగరము
విశ్వపాలకము
అదియే అదియె ప్రయాగ క్షేత్రము
గంగయమునల
సంగమ కలశము ||షిరిడియె||
సప్తగిరుల
వెంకన్న నివాసము
అష్టసిరుల
ఆనందజీవనము
అదియే అదియె అయోధ్యనగరము
రామచంద్రుల
పాలిత రాజ్యము ||షిరిడియె||
నలుపాదంబుల నడచే
ధరమము
పురుషార్థముల
నొసగే శిబిరము
సహన శ్రద్దల చివురుల వృక్షము
నాలు గారతుల వెలుగుల వలయము ||షిరిడియె||
శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సముద్రస్నానం అన్నిపుణ్యనదుల స్నానానికి సమానమని యంటారు. అలాగే సాయిదేవులు సర్వదేవీదేవతా స్వరూపులుగావున షిర్డీ దర్శనం అన్ని తీర్థయాత్రల సందర్శనంగా తలంచవచ్చు.
ReplyDelete