సాయితోటి బంధం!
శ్రీసాయినాథాయనమః
" నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుకకాళ్లకు దారముకట్టి యీడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను." శ్రీసాయిసచ్చరిత్ర,28వ అధ్యాయము
మనకు తెలియవచ్చును,తెలియపోవక వచ్చును కాని ఓ విషయం సత్యమేమన, సాయి అనుగ్రహంలేక వారి మార్గంలోకి రాలేము. లాగడం ఆయన కరుణ, కట్టుబడి ఉండటం మన బాధ్యత. బాబా చెప్పిన మావిడి పూతలా మధ్యలో రాలిపోకుండా చివరికంటా ఆయన మార్గంలో మన జీవితాలు ఫలవంతములు కావాలని ఆకాంక్ష, ప్రార్థన !
సాయితోటి బంధం!
జనమ జనముల పుణ్యమేమో
సాయినాథుల
పాదబంధం
సాయినాథుల
పాద బంధం
సాయి పాదుక సేవ భాగ్యం
హనుమ రామల భక్తి బంధం
మీర మోహన రాగ బంధం
మీర మోహన రాగ బంధం
శక్తి శంకర నాగబంధం
సాయి సద్గురు పాద బంధం || జనమ జనముల
||
రాతి శకలమె నాదు
జనమం
రీతి శూన్యమె నాదు గమనం
మాలి కాయిలె సాయినాథం
ఏలికాయెలె
సాయిపాదం || జనమ జనముల ||
లీల ఇదియే బాబ బంధం
సాయిపిలుపే
ప్రేమగంధం
సాయి నిలుపూ నేటి బంధం
ఏనాటి బంధమో సాయితో? మాయజేసి , మనసుల లాగుచున్నాడు!
ReplyDelete