ఈశ్వర రూప సాయి
శ్రీసాయినాథాయనమః
ఈశ్వర రూప సాయి
ఈశుని ప్రతిరూపం సాయీశుని అవతారం
షిరిడియే
కైలాసం గౌరీశుని
ఆవాసం
గంగను వలచి శిరమున
నిలిపెను
భళి భళి శంకరుడు భక్త
శుభంకరుడు
గంగను పాదము పొంగగ
జూపెను
అరెరే సాయిసుడు అవనిలొ పావనుడు ||ఈశుని
ప్రతిరూపం||
ముల్లోకంబుల
భిక్షను పట్టెను
భళి భళి శంకరుడు భక్తుల పాలకుడు
షిరిడీ
వీధుల భక్ష్యము లందెను
అరెరే సాయిసుడు కర్మల
నాశకుడు ||ఈశుని ప్రతిరూపం||
లలాట ఫలక విభూతి
రేఖల
భళి భళి ధవళేసుడు ధవళాచల మందిరుడు
ధుని వెలిగించి విభూతి పంచెను
అరెరే సాయిసుడు భవభయ
నాశకుడు ||ఈశుని
ప్రతిరూపం||
యోగముద్రలో
మనసు లయముతో
భళి భళి లయకరుడు భక్తవ
బాంధవుడు
యోగిరాజులే
యోగములన్నిట
అరెరే షిరిడీసుడు యోగుల నాయకుడు ||ఈశుని ప్రతిరూపం||
కంటిమంటతో
కాముని గాల్చెను
భళి భళి త్రినేత్రుడూ
మన్మధ నాశకుడు
బ్రహ్మచర్య
వ్రత తా వరిష్ఠుడు
అరెరే సాయిసుడు ఆపద్బాంధవుడు ||ఈశుని ప్రతిరూపం||
పార్వతి
దీక్షకు పరిణయమాడెను
భళి భళి శంకరుడు భక్తికి
పరవశుడు
లోక , కళ్యాణ
నెపమున షిరిడి జేరెను
అరెరే సాయిసుడు లీలల పాలకుడు ||ఈశుని ప్రతిరూపం||
హాలాహలమును గళమున
నింపెను
భళి భళి శంకరుడు నీలా కంధరుడు
భక్తుల
వ్యాధుల బాధల పొందెను
అరెరే సాయిసుడు ఆర్తుల
ఆలకుడు ||ఈశుని
ప్రతిరూపం||
"నమఃశివాయ"
ను నామముతోడనే
భళి భళి శంకరుడు పావన
పాలకుడు
"సాయని"
పిలిచిన సాయము
వెంటనె
అరెరే సాయిసుడు పరుగుల
పరమేశుడు ||ఈశుని
ప్రతిరూపం||
బిళ్వపత్ర అభిషేక
పూజల
భళి భళి శంకరుడు భక్తాశ్రయ
పాలకుడు
నిత్య అర్చన ఆరతులందుచు
అరెరే సాయిసుడు హాయి
ప్రదాయకుడు ||ఈశుని
ప్రతిరూపం||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
శ్రీసాయి ఈశ్వర స్వరూపులు; సాయికి పరమేశునికి యెన్ని పోలికలో!
ReplyDelete