సాయియే ప్రణవం.


శ్రీసాయినాథాయనమః 

సాయినామమె  ఓంకార స్వరము! సాయినామమె  ఓంనమోనారాయణాయ!సాయినామమె  ఓంనమఃశివాయ! 
ప్రణవ స్వరూపం. కుమారి విజయలక్ష్మి ( కొత్త ఢిల్లీ ) " శ్రీసాయిలీలామృతము పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి, మనశ్శాన్తి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహమవ్వాలని ఆమె  బాబాను ప్రార్ధిస్తే ఆమెకు 1986 లో ఒక డాక్టరుతో వివాహమైంది. అతడు ఆర్యసమాజానికి చెందినవాడవటం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తికోసం బాబాకు అగరొత్తి గూడ పెట్టినా ఓంకారమొక్కటే ధ్యానించ దగిన దనేవాడు . అతడు జెర్మనీ వెళ్లేముందు ఆమె తృప్తికోసం బాబాకు పూజజేసి, " ఏనాడో పరమపదించిన బాబా , మన ప్రార్థన ఎలా వింటారు? " అన్నాడు. రెండురోజుల తర్వాత అతడు ఆస్పత్రిలో పడుకొని వుండగా కలలో గాఢాంధకారము కన్పించి , అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దానిమధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కన్పించి , చేయెత్తి ఆశీర్వదించారు.వారిచేతిలో బంగారుకాంతిగల ఓంకారమున్నది. దానినుండి వెలుగు అతనిపై బడింది. వెంటనే బాబా కన్నులుమూసి ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయనరూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు , పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్దప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికివచ్చి ఆనందభాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు. సాయియే ప్రణవం.
శ్రీసాయిలీలామృతము ( 137-138 పేజీలు), పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ

సాయియే ప్రణవం.

జనమ జనమల  తపమొ  సాయి పూజా ఫలము
సాయిపూజా ఫలము    సాయి పావన ధనము

ఆదినాదంబదియె   ఓంకార స్వరము
విరించి తలపే     ఓంకార స్వరము
జీవనాడుల రవము      ఓంకార స్వరము
సాయి సాయీ స్వరమే   ఓంకార సమము                           |జనమ జనమల|

సిరుల తరులా గృహమె నారాయణం
మరుల మోహన రూపె  నారాయణం
మహతి రాగాలలరు      నారాయణం
సాయి సాయి స్మరణే     నారాయణ సమము                      |జనమ జనమల|

పాపతాప హరణం పరమశివుని నామం
పాడు జనమకు మోక్షం పరమశివుని నామం
కోటి శిక్షల రక్షే పరమశివుని నామం 
సాయి సాయి ఘనమె పంచాక్షరీ సమము                          |జనమ జనమల|

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!







Comments

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!