జగన్నాటక సూత్రధారి
శ్రీసాయినాథాయనమః
" నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే." శ్రీసాయిసచ్చరిత్రము 3 వ అధ్యాయము
" ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారిపనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను." శ్రీసాయిసచ్చరిత్రము 28 వ అధ్యాయము
జగన్నాటక సూత్రధారి
సాయియే
సత్యము సాయియే నిత్యము
సాయియె పెన్నిధి
సద్గురువున్
సాయిని
పాడుము సాయిని
చూడుము సాయినె కన్నుల పండుగగన్
సాయిని
పిల్వుము సాయిని
కొల్వుము సాయియె సంపద పెంపనగన్
సాయియె
లీలగ సాయియె క్రీడగ సాయియె సత్వర సాయముగన్
సాయియె
రాముడు సాయియె రంగడు సాయియే మంగళ
శంకరుడున్
సాయియె జీససు
సాయియె నానకు సాయియె
గౌతమ బుద్ధుడనన్
సాయియె
దత్తుడు సాయియె ముక్తుడు సాయియే భక్తుల పాలకుడున్
సాయియె
భక్తియు సాయియె ముక్తియు సాయియె యూక్తుల యోగి యనన్
సాయియె
కార్యము సాయియె కర్మము సాయియె కారణ జన్ముడనన్
సాయియె
కర్తయు సాయియె భోక్తయు సాయియె చిత్తపు శాంతియనన్
సాయియె
దానము సాయియె థర్మము సాయియె భోగము భాగ్యమనన్
సాయియె
ముక్తియు సాయియె సూక్తియు సాయియె సూమపు మాలయనన్
సాయి
గొపాలుడు సాయియె పార్ధుడు సాయియె గీతకు అర్ధమనన్
సాయియె
వేదము సాయియె నాదము సాయియె మోహన రూపనగన్
సాయియె
ధామము సాయియె భావము సాయియె లోకపు
పావనమున్
సాయియె
దీపము సాయియె ధూపము సాయియె పూజల
పుణ్యమనన్
సాయియె
యాగము సాయియె యోగము సాయియె ఖండపు
యోగియనన్
సాయియె
వాయువు సాయియె వహ్నియు సాయియె వారుణ దేవుడనన్
సాయియె
ధాత్రియు సాయియె మైత్రియు సాయియె అంబర శోభయనన్
సాయియె
నేత్రము సాయియె శాస్త్రము సాయియె శాసన కర్త యనన్
సాయియె
జాలియు సాయియె ధూళియు సాయియె అంతర సంచలమున్
సాయియె
రాగము సాయియె తాళము సాయియె మేళపు
సంబరమున్
సాయియె
బోళయు సాయియె కేళియు సాయియె బృందపు లీలయనన్
సాయియె
బాలక సాయియె వృద్ధక సాయియె శ్రద్ధల నాయకుడున్
సాయియె
గంగయు సాయియె గౌరియు సాయియె జంగమదేవరనన్
సాయియె
వాణియు సాయియె కాళియు సాయియె దుర్గల రూపనగన్
సాయియె
చావడి సాయియె మస్ జిద్ సాయి
సమాధి సుమందిరమున్
సాయియె
విశ్వము సాయియె భస్మము సాయియె రష్ముల కూటమనన్
సాయియె
జాగృతి సాయియె స్వప్నము సాయియె శాంతుల సీమయనన్
సాయితు
రీయమె సాయి
బలీయమె సాయి
ప్రణావపు నాదముగన్
సాయియె
ధర్మము సాయియె అర్ధము సాయియె మోక్షపు కారణమున్
సాయి
యనంతము సాయి అఖండము సాయి
అభేదము చూడగనన్
సాయియె
వేదిక సాయియె వేషము సాయియే నాటక
సూత్రుడనన్
సాయియె
నిన్నయు సాయియే నేడును సాయియె రేపటి రూపుయనన్
సాయియె
బ్రహ్మయు సాయియె విష్ణువు సాయియె శంకర రూపుడనన్
సాయియె
మూలము సాయియె దైవము సాయితొ జన్మము
ధన్యమిలన్
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
--------------------------------------------------------------------------------------------------------------------------
మనజీవితము నాటకము, లోకము రంగస్థలమైతే , సాయి యీ నాటకమును నడిపించు అగోచర సూత్రధారి.
ReplyDelete