షిరిడిపురమది అందరిది!

శ్రీసాయినాథాయనమః 

షిరిడిపురమది  అందరిది!

షిరిడి పురమది అందరిది  సాయీశుడు అందరి వాడేలే
ఎందుకె మనసా భయ భ్రాంతులు సాయి సన్నిధి పొందవటే

చల్లని చూపుల సుందర రూపుడు భక్తుల యెల్లర బ్రోచుగదా
మోహాలేలా తాపాలేల మురళీధరుని చేరగ రావొ                                              ||షిరిడి పురమది||

ద్వారకామాయి  మోహన రూపుడు భక్తుల కభయము నొసగుగదా
తర్జనలేలా భర్జనలేల సాయి సన్నిధి చేరగ రావో                                               ||షిరిడి పురమది||

ధుని వెలిగించిన దయగల రూపుడు దీనులాగాచి బ్రోచుగదా
పాపాకర్మల ధుని మండింపగ పరుగున సాయిని చేరగరావో                               ||షిరిడి పురమది||

జలముతొ వెలిగెను దీపపు కాంతులు ,మనమున తొలగెను తిమిరపు తెరలు
సాయిభావమును మదిని నింపుచు షిరిడి పురమును చూడగ రావొ                  ||షిరిడి పురమది||
      
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


Comments

  1. Holy Shirdi welcomes everyone, Sai belongs to one and all!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!