ఆరాటం ఇది ఆరాటం!!!

శ్రీసాయినాథాయనమః 

ఆరాటం ఇది ఆరాటం

ఆరాటం ఇది ఆరాటం , జీవుని జీవన పోరాటం
జీవుని జీవన పోరాటం , ఏమిటొ నెరుగని ఆరాటం

లోభికి తరగని ఆరాటంబహుసంపద పెంపుకు ఆరాటం
మేడల మిద్దెల ఆరాటం , ఎందుకొ తెలియని ఆరాటం                        ||ఆరాటం ఇది ఆరాటం||  

శిశువుకు తీరని ఆరాటం ,  తనమాతను జేరెడి ఆరాటం
మాతను జేరెడి ఆరాటం భాషల నెరుగని ఆరాటం                         ||ఆరాటం ఇది ఆరాటం||

ప్రేయసి కూడెడి ఆరాటం , ప్రేమకై ప్రీయుని ఆరాటం
అన్యము గాంచని ఆరాటం ,  ప్రేయసి పొందుకె  ఆరాటం                  ||ఆరాటం ఇది ఆరాటం||

మేఘపు జలముల ఆరాటంనేలను తాకెడి ఆరాటం
వెల్లువ నురగల ఆరాటం , ..సాగరు జేరెడి ఆరాటం                          ||ఆరాటం ఇది ఆరాటం||

వేణువు గాలికి ఆరాటం..  గోకుల గోపిక ఆరాటం
తడబడు పరుగుల ఆరాటంగో..పాలుని కూడెడి ఆరాటం                   ||ఆరాటం ఇది ఆరాటం||

పరమందుటకే ఆరాటంగురుపదమొందుటకే ఆరాటం
వి.. యోగమె జీవికి పోరాటం , తన తండ్రితొ యోగమె పరమార్థం         ||ఆరాటం ఇది ఆరాటం||

తనువున తరగని ఆరాటం , తపనల మనసున ఆరాటం
షిరిడిని జేరెడి ఆరాటం దేవుని జూచెడి ఉబలాటం                         ||ఆరాటం ఇది ఆరాటం||


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక !
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


సాగరసంగమం 


Comments

  1. "నదీనదాలు తమగమనంలో, ఒడిదుడుకుల నతిక్రమించి సాగరునిలో కలిసేవరకూ ఆరాటపయనాన్ని కొనసాగించినటుల, సత్యాన్వేషులు సదా అలజడులకావలి సుస్థిరశాంతి పొందువరకు తమ పోరాటంలాంటి ఆరాటంతో ముందుకెళతారు. అప్పటివరకు విశ్రమించరు."

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!