కోటిరూపులవాడు
కోటిరూపులవాడు కొలువుదీరున్నాడు
షిరిడి కోవెల నేడు వెలుగు చున్నాడు
షిరిడి కోవెల నేడు వెలుగు చున్నాడు
సుందరాంగుడు
వాడు నీలి కన్నులవాడు
ద్వారకామాయిలో
వెన్నదొంగయె వాడు ||కోటిరూపులవాడు||
కోమలాంగుడు
వాడు కనక కాంతులవాడు
జీ.. వన సారధియే దాశరథియే
వాడు ||కోటిరూపులవాడు||
భస్మ ధారణ వాడు భవ్యరూపుడు
వాడు
భక్తజన
వాకిళ్ళ పరమశివుడే
వాడు ||కోటిరూపులవాడు||
జాలి గుండెల వాడు మేలి బంగరు వాడు
శరణన్న
వారలకై పరుగుదీసెడు
వాడు ||కోటిరూపులవాడు||
సత్సంగ
భక్తుల చల్లగాచెడు
వాడు
నిరతంబు
మా యెదల నిండి బ్రోచెడు
వాడు ||కోటిరూపులవాడు||
17-02-2008 భీష్మేకాదశి
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
" శ్రీరాముని రూపం పురుషులనుగూడ సమ్మోహనపరచేదట. శ్రీకృష్ణునిజూసి సర్వజీవులూ తమను తామే మరచేవట. దత్తావతారమైన సాయిరూపంగూడా అలానే వుండేదట. ఆయనను సగుణమేరు నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే సాయియే, ' పిచ్చివానిలా అలా చూస్తావేమి? ' అనేవారు."
ReplyDelete