నీకు పూజ లెట్లయ్యా ?
నీకు పూజ లెట్లయ్యా ?
ఎట్లయ్యా,
ఎట్లయ్యా, నీకు పూజ లెట్లయ్యా
?
సాయి సాయి సాయయ్యా ,మాకు
తండ్రి నీవయ్య!
పూలు ఎన్నో తేవాలంటె , పువ్వుల మనస్సు
నీదయ్యా,
జలములెన్నో
తేవాలంటె , గంగాయమునలె నీవయ్యా! || ఎట్లయ్యా
ఎట్లయ్యా ||
మల్లే మాల వెయ్యాలంటే ,తెల్లని మల్లె
నీవయ్యా ,
చందనలెన్నో
అద్దాలంటే , చల్లని వెన్నెల
వీవయ్యా ! || ఎట్లయ్యా ఎట్లయ్యా
||
ఫలములెన్నో
తేవాలంటే ,పుణ్యఫలమే నీవయ్యా,
భావాలెన్నో
గూర్చాలంటే ,భావాతీతుడ వీవయ్యా! || ఎట్లయ్యా ఎట్లయ్యా
||
దీపాలెన్నో
చూపాలంటే ,దీపపు వెలుగూ నీవయ్యా
ధూపాలెన్నో
వేయాలంటే ,దునివెలిగించితి వీవయ్యా || ఎట్లయ్యా ఎట్లయ్యా
||
కప్పుర
ఆరతులిద్దామంటే , పాపా హరుడవు నీవయ్యా,
కమ్మను
వాసను లిద్దామంటే , గుప్పను పరిమళ మీవయ్యా
! || ఎట్లయ్యా
ఎట్లయ్యా ||
విందులెన్నో
ఇద్దామంటే , అన్నదాతవె నీవయ్యా,
మంత్రాలెన్నో
చదవాలంటే, మహిమల సామివి నీవయ్యా
! || ఎట్లయ్యా ఎట్లయ్యా
||
దానాలెన్నో
చేయాలంటే , దానకర్ణుడ వీవయ్యా ,
కానుకలెన్నో
ఇద్దామంటే , దక్షిణలిత్తువు నీవయ్యా ! || ఎట్లయ్యా
ఎట్లయ్యా ||
నర్తనపూజ
చేయాలంటే , నటరాజువే నీవయ్యా ,
వెన్నముద్దలిద్దామంటే
, నవనిత చోరుడ వీవయ్యా ! || ఎట్లయ్యా
ఎట్లయ్యా ||
యోగాలెన్నో
జేదామంటే , యోగిరాజువె నీవయ్యా ,
త్యాగాలెన్నో
చేదామంటే , ఫకీరు వేషము నీదయ్యా
! || ఎట్లయ్యా ఎట్లయ్యా
||
అన్నిమరచి
తలచిన వారికి , అంగారక్షకుడీవయ్యా,
శాయా శక్తుల గొలచినవారికి , భుక్తీ
ముక్తీ నీవయ్యా! || ఎట్లయ్యా
ఎట్లయ్యా ||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
"సాయిబాబా అనంతశక్తి స్వరూపులు, మరి మన శక్తి పరిమితమైనది. పరిమితశక్తితో , అనంతశక్తినెలా సేవించడమూ, కొలవడము? కేవలము సర్వశ్య శరణాగతితోడనే యది సాధ్యము! "
ReplyDelete