సాయిధ్యానము!

శ్రీసాయినాథాయనమః 

" నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది! ఆత్మసాక్షాత్కారానికి ధ్యానమవసరము. సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు." సాయిబాబా చెప్పిన ధ్యానసూత్రము , శ్రీసాయిసచ్చరిత్రము  

సాయిధ్యానము!

సాయీ...  నామము  దరిజేర్చు నామము
మరి మరీ...  దొరకని అమృత  నామము
దొరికె నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి సేయవె మనసా...  ధ్యానము               || సాయీ...  నామము ||

అటునిటు చూడకు  మరి మరీ వెదకకు
ఊరూరు తిరగకు  దూరము వెడలకు
దొరికె నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి సేయవె  మనసా...  ధ్యానము              || సాయీ...  నామము ||

శోకమదె దూరము, మోహమదె దూరము
రోగము దూరము  రాగమూ దూరము
దొరికె నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి సేయవె  మనసా...  ధ్యానము              || సాయీ...  నామము ||

బాలగోపా   లీలల నామము
పలికితె  చాలులే  పాపాలు మాయము
దొరికె నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి సేయవె  మనసా...  ధ్యానము              || సాయీ...  నామము ||

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికీశుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


Comments

  1. "అన్యదారుల అలసట చెందక, సద్గురుసాయినాథుని పథములో నడచుట శాంతిమయ, సుఖమయ జీవనానికి సమీప మార్గము!"

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!