సాయిధ్యానము!
శ్రీసాయినాథాయనమః
" నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది! ఆత్మసాక్షాత్కారానికి ధ్యానమవసరము. సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు." సాయిబాబా చెప్పిన ధ్యానసూత్రము , శ్రీసాయిసచ్చరిత్రము
సాయిధ్యానము!
సాయీ... నామము దరిజేర్చు
నామము
మరి మరీ... దొరకని
అమృత నామము
దొరికె
నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి
సేయవె మనసా... ధ్యానము || సాయీ... నామము
||
అటునిటు
చూడకు మరి
మరీ వెదకకు
ఊరూరు తిరగకు దూరము
వెడలకు
దొరికె
నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి
సేయవె మనసా... ధ్యానము || సాయీ... నామము ||
శోకమదె
దూరము, మోహమదె దూరము
రోగము దూరము రాగమూ
దూరము
దొరికె
నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి
సేయవె మనసా... ధ్యానము || సాయీ... నామము ||
బాలగోపాల లీలల
నామము
పలికితె చాలులే పాపాలు
మాయము
దొరికె
నీవేళ, సేయవే ధ్యానము
గురినిలిపి
సేయవె మనసా... ధ్యానము || సాయీ... నామము ||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
"అన్యదారుల అలసట చెందక, సద్గురుసాయినాథుని పథములో నడచుట శాంతిమయ, సుఖమయ జీవనానికి సమీప మార్గము!"
ReplyDelete