ఏలికవు నీవయ్య సాయీ !
శ్రీసాయినాథాయనమః
ఏలికవు నీవయ్య సాయీ
ఏలికవు నీవయ్య సాయీనన్నేలు పాలకుడవీవయ్య సాయీ
గీతసారము నీవు సాయీ
భవరోగ తాపహరణము నీవు సాయీ
భక్తజన పోషకుడవీవు
వారిచిత్తముల బంది వైనావు
హృదయద్వారము తెరచినాను
ద్వారకామయుడ నన్నేల రమ్ము
ఆర్తజన రక్షకుడవీవు
వారి పిలుపులకు పలుకు వేలుపువు
దిక్కుదోచక నిలచినాను
చిక్కుదీర్పగ వేగ రమ్ము
మహిమలా మారాజు వీవు
మహిలొ లీలలెన్నో జూపినావు
కలిమాయలో కుమిలినాను
తొలిదైవమా బలిమినిమ్ము !
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికీశుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
" సాయినాథా! కలివలనుండి నన్ను కాపాడు."
ReplyDelete