సేవలు నీకె!
శ్రీసాయినాథాయనమః
సేవలు నీకె
సేవలు
నీ...కె , సేద్యము
నీ...కె
సాధ్యము
సేయవె సాయి... ,
భావము
నీదే నాదము
నీదే
సన్నిధి
జేర్పవె సాయీ ,
నీ సన్నిధి జేర్పవె సాయి
ద్వాదశ
కాంతుల సొబగుడ వీవె
షోడశ
పూజలు పూజలు నీకె
రాజులనేలెడి
రాయడ వీవే ...
జాజుల
హారము ఆరతి నీకె | సేవలు నీకె |
మల్లియ
మాలిక మనసుడవీవె
మాలికు
జూపెడి మార్గము నీదె
బాలుని
దోషము భాష్యము సేయకు
పల్లకి
బోయను సాయీ ...,
నీ పల్లకి బోయను సాయి | సేవలు నీకె |
క్షేత్రము
మారెను బీడుగ నేడిల
బాడుగ
నేలిది బాబా....,
నామపు
నాగలి బాగుగ బట్టుచు
మడులుగ
మలచెద దేవా....
నే మదినే .., మలచెద దేవ | సేవలు నీకె |
భక్ష్యము
నిత్తువు శిక్షణ
నిత్తువు
దక్షత
మాతవు , లక్ష్యము జేర్తువు
వక్షము
నందున ... నావక్షమునందున
వట వృక్షంబై , రక్షణ సేయవె దేవా...
సం రక్షణ సేయవె దేవ | సేవలు నీకె |
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
" షిరిడీలో వేపచెట్టు పక్కనున్న బీడుభూమిలో సాయి ఓచక్కని పూలతోట మొలిపించారు, నా హృదయక్షేత్రాన్ని శుద్ధిజేసి దైవీగుణముల పండించుగాక! "
ReplyDelete