సేవలు నీకె! All Service Is Thine, O Sai.

శ్రీసాయినాథాయనమః 

సేవలు నీకె
సేవలు నీ...కె ,  సేద్యము నీ...కె
సాధ్యము సేయవె సాయి... ,
భావము నీదే  నాదము నీదే
సన్నిధి జేర్పవె సాయీ ,
నీ సన్నిధి జేర్పవె సాయి

ద్వాదశ కాంతుల సొబగుడ వీవె
షోడశ పూజలు పూజలు నీకె
రాజులనేలెడి రాయడ వీవే ...
జాజుల హారము ఆరతి నీకె                        | సేవలు నీకె |

మల్లియ మాలిక మనసుడవీవె
మాలికు జూపెడి మార్గము నీదె
బాలుని దోషము భాష్యము సేయకు
పల్లకి బోయను సాయీ ...,
నీ పల్లకి బోయను సాయి                         | సేవలు నీకె |          

క్షేత్రము మారెను బీడుగ నేడిల
బాడుగ నేలిది   బాబా....,
నామపు నాగలి బాగుగ బట్టుచు
మడులుగ మలచెద దేవా....
నే మదినే .., మలచెద దేవ                      | సేవలు నీకె |

భక్ష్యము నిత్తువు  శిక్షణ నిత్తువు
దక్షత మాతవు , లక్ష్యము జేర్తువు
వక్షము నందున ... నావక్షమునందున
వట వృక్షంబై , రక్షణ సేయవె దేవా...
సం రక్షణ సేయవె దేవ                            | సేవలు నీకె |                  

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



All Service Is Thine, O Sai Chorus All service is Thine, O Sai, All effort and offering—Thine alone. Make the impossible possible, Sai, Draw me into Thy sacred Presence, O Sai, Draw me into Thy holy Presence. Thy beauty shines with twelve-fold splendor, Sixteen sacred worships belong to Thee. King of kings, the sovereign ruler, Jasmine garlands, āratī for Thee. (Chorus) Thou art the fragrant mansion of the heart, The guiding path that leads us home. Do not weigh a child’s faults, O Sai, Carry me gently in Thy holy palanquin, Carry me, O compassionate Sai. (Chorus) The field has turned barren in these times, The land lies weary and wounded, Baba. Holding firmly the plough of Thy Holy Name, Refine and reshape my heart, O Deva, Reshape my restless heart, O Lord. (Chorus) Thou feedest us, Thou trainest us, Thou grantest skill and leadest to the goal. Within Thy bosom—within my own heart, Stand as the sacred Banyan Tree, Sheltering, protecting us, O Deva, Grant Thy loving protection, O Lord. (Chorus) Blessing May Sri Sai’s rays of compassion Spread upon all, everywhere. May auspiciousness dawn for all beings. Om Sai, Sri Sai, Jaya Jaya Sai! 🌸🙏

Comments

  1. " షిరిడీలో వేపచెట్టు పక్కనున్న బీడుభూమిలో సాయి ఓచక్కని పూలతోట మొలిపించారు, నా హృదయక్షేత్రాన్ని శుద్ధిజేసి దైవీగుణముల పండించుగాక! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!