ఒక్కసారీ చాలు

శ్రీసాయినాథాయనమః 

భక్తితోటె స్మరణ మేలు మేలు,శ్రద్ధ తోటె సేవ దేవదేవ
సాయి ఇలలొ మనకు దైవమేను,తనువు మనమూ గూర్చి కొలవరయ్య!

ఒక్కసారీ చాలు సాయినామ స్మరణ
ఒక్కసారీ చాలు సాయినామ స్మరణ
భక్తి గంధముతోటి బాబసాయి స్మరణ

ఒక్కదీపమె కారు చీకటుల దొలగించు
చూడ చూడగ చక్క దారులవె గనుపించు
పెక్కుమంత్రములేల ఒక్కనామమె చాలు
సుక్కలలొ సెందురుడు బాబసాయిబాబ                    | ఒక్కసారీ చాలు |

ఒక్కమాటయె రామ, బాణమొక్కటియేను
పెక్కురక్కసిమూక దరప మణచేను   
వెలుగు ఒక్కటియేను అందరిలొ అలరారు
గురువు ఒక్కడె సాయి, బరువులెల్ల దీర్చు                 | ఒక్కసారీ చాలు |    

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



Comments

  1. " సాయినాథుల అనుగ్రహము పొందుటకు ఒక్క హృదయపూర్వక నమస్కారము చాలును, జన్మధన్యతకు ఒకేవక్క సాయినామము చాలును."

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

SriSai Ashtakam 2.

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!