షిరిడిపురమది అందరిది!
శ్రీసాయినాథాయనమః షిరిడిపురమది అందరిది! షిరిడి పురమది అందరిది సాయీశుడు అందరి వాడేలే ఎందుకె మనసా ఈ భయ భ్రాంతులు సాయి సన్నిధి పొందవటే చల్లని చూపుల సుందర రూపుడు భక్తుల యెల్లర బ్రోచుగదా మోహాలేలా తాపాలేల మురళీధరుని చేరగ రావొ || షిరిడి పురమది || ద్వారకామాయి మోహన రూపుడు భక్తుల కభయము నొసగుగదా తర్జనలేలా భర్జనలేల సాయి సన్నిధి చేరగ రావో || షిరిడి పురమది || ధుని వెలిగించిన దయగల రూపుడు దీనులాగాచి బ్రోచుగదా పాపాకర్మల ధుని మండింపగ పరుగున సాయిని చేరగరావో || షిరిడి పురమ...