సాయివైద్యా నీకు వందనం!
శ్రీసాయినాథాయనమః
వైద్యునికి రోగినాడి తెలుసు గావున వేరు వేరు రోగులకు వేరు వేరు మందులు వారి అవసరాలను బట్టి వాడమని చెబుతారు. ఈవిషయంలో రోగి డాక్టరు సలహా పాటించటం తన శ్రేయస్సుకొరకేగదా! అలాగే సద్గురువులకు తమ భక్తులకేది మేలో, ఏది కీడో బాగుగ తెలుసు. కొందరికి ఆరోగ్యమవసరం, కొందరికి మానసిక ప్రశాంతత అవసరం,కొందరికి డబ్బు అవసరం, మరికొందరికి విద్య, ఉద్యోగాలు అవసరం. మరికొందరికేమో ఆధ్యాత్మికస్థితిలో ప్రగతి, సహాయం అవసరం. అందరికి ఒక్క అవసరముండదు, ఉపయోగపడదుకూడా . శ్రీ సాయి, సమర్థ సద్గురులు గాన ఆయనకు వేరు వేరు భక్తులకు ఏమి అవసరమో, ఎంతఅవసరమో బాగుగా తెలియును. ఒక్కోసారి మనంకోరుకునే కోరికలు మనకు మంచిని చేయవచ్చు, చెడునూ కలుగజేయవచ్చు.
బాబాను సేవించిన వివిధ భక్తులను వేరువేరువిధముల అనుగ్రహించారు. దాసగణుకు కీర్తనసేవ, భాగోజీ షిండేకి తమ పాదసేవ, శ్యామాకు, తాత్యాకోతేపాటీలుకు తమ అవసరాలదీర్చే సేవ ఇలా వేరు వేరు విధముల దీవించారు. కొందరిని కోటీశ్వరుల జేశారు. కాని పేదరికంలో ఉన్న భక్త మహాల్సాపతికి ఎలాంటి ధనసహాయం చేయలేదు.హంసరాజు అనే భక్తుడు ఇవ్వదలచిన ధనసహాయమును తిరస్కరింపజేశారు. కాని ఆధ్యాత్మికంగా యాతని ఉన్నతశిఖరాలకు జేర్చారు. సద్గురుసాయిని గుర్తుంచుకొన్నన్నాళ్లు ఏసాయిభక్తులు సాయినామకరణ కర్త మహల్సాపతి పేరును మరువలేరు. కావున సద్గురుసాయి భక్తులు కేవలం ధనసంపదలేగాక, బాబా ఏవిధంగా అనుగ్రహిస్తే దానిని స్వీకరించడం, లభించినదానితో తృప్తిపొందటం వారి శ్రేయస్సుకొరకేగదా!
సాయివైద్యా నీకు వందనం!
గుండె గుండె గుండెలో, నిండినావులే
ఎవరికేమి
ఇవ్వాలో నీకు తెలుసులే
ఆరాట నాటకాన మేము పావులం
నాడి మాది నీకెరుకే వైద్య వందనం ,
సాయివైద్య
వందనం
భక్తరక్ష
చింతామణి బాబ నీవెలె
భాగోజీ
దేహబాధ బాపినావులె
మర్మవేష
భాషల బ్రహ్మ వీవెలె
మైనతాయి
వేదనంత మాపినావులె || గుండె గుండె గుండెలో ||
చోల్కరుకు
తీపి తీపి చక్కెరీవెలె
తాత్యకేమొ
మేనమామ వరుస నీవేలె
శ్యామకేమొ దేవ
దేవ సఖుడవైతివె
మేఘునకు
సాయి నీవు శివుడ కావటే || గుండె గుండె గుండెలో ||
దాసగణుకు గాంధర్వ గానమైతివె
బూటీకి
కోటిరూక సామి వైతివే
దబోల్కరుకు
హృదయసీమ వాణి వీవెలె
పటాంకరుకు నవవిధా
భక్తి నీవెలె || గుండె గుండె గుండెలో ||
నీటితోనె
దీపాలను చూపినావుగ
సాయి సాయి నీలీల చెప్పలేముగ
మాల్సపతిని
అటు లటులే ఉంచినావుగ
చిరుగులలో
జ్ఞానఫలము నింపినావుగా || గుండె గుండె గుండెలో ||
మాదుహితము
తెలియలేని మోహజీవులం
మాయజగతి
నాట్యమాడు మట్టిబొమ్మలం
శరణు శరణు శరణిదే సాయివందనం
దరిజేర్పుము
గుడిజేర్పుము జన్మ అంకితం,
సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో మన బాధ విన్నవించుకోవచ్చును, అయన మనకేదిమంచిదో అదిచేస్తారనే నమ్మకముంచుకోవడం శ్రేయస్కరం!
ReplyDelete