శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ మహిమ, ఓ భక్తురాలి అనుభవం!
శ్రీసాయినాథాయనమః
"శ్రీసాయిలీలలను అలవోకగా విన్నను ఆధ్యాత్మజీవితమందు శ్రద్ధ కలుగును. పాపములు నశించును. సాయిలీలలను ఇతరులకు చెప్పినచో నందు కొత్తవిషయములు గ్రహించగలరు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తిప్రేమలతోను,పూర్తి నమ్మకముతోను పారాయణముచేసి వారమురోజులలో ముగింతురో, వారియాపదలన్నియు నశించగలవు. ధనమును కోరిన పొందవచ్చును,వర్తకుల వ్యాపారము వృద్ధినొందును. శ్రీసాయి ప్రీతిచెంది యజ్ఞానమును పేదరికమును నిర్ములించి జ్ఞానము ఐశ్వర్యముల నొసంగును. రోగులు ఆరోగ్యవంతులగుదురు. వారిమనసులందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. భక్తుడు సాయిని శరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును." శ్రీసాయిసచ్చరిత్రము
ఓ భక్తురాలి అనుభవం!
హ్యూస్టన్ లోని నాకు తెలిసిన ఓ భక్తురాలి ( గోప్యం కోసం పేరు చెప్పుటలేదు) శ్రీసాయిసచ్చరిత్రము పారాయణ అనుభవము. ఆమెకు సాయిబాబానుగూర్చి పెద్దగా తెలియదు. ఓ సందర్భంలో కలిసినప్పుడు బాబాను గూర్చివిని, తన సమస్యల నివారణకై శ్రీసాయిసచ్చరిత్ర చదవాలనుకొంది. ఆమెవద్ద సచ్చరిత్ర పుస్తకము లేకుండుటచె నానుండి ఇంగ్లీషు కాపి తీసికెళ్ళింది. సాధారణంగా పారాయణ గురువారం మొదలుపెట్టి 7 రోజులు చేయాలని చెప్పాను. ఆమె శనివారం పుస్తకం తీసికెళ్ళి , గురువారం వరకు వేచియుండలేక ఆరోజే పారాయణ మొదలుపెట్టింది. పారాయణలో అభిరుచి, ఉత్సాహం పెరగటంతో మూడురోజులలోనే పారాయణ పూర్తిచేసినది. ఆఖరిరోజున చివరి పేజీలు చదువుచున్నపుడు ఇంట్లోని ఫోను మ్రోగనారంభించింది. కాని పుస్తకం పూర్తికానిదె ఫోన్ వద్దకు వెళ్ళగూడదని చదవడం కొనసాగించింది. ఫోన్ రింగింగ్ కూడా అలానే కొనసాగింది.
శ్రీసాయిసచ్చరిత్ర పరాయణ చేసి అందరు శ్రీసాయినాథుల అనుగ్రహమును పొందెదరుగాక!
ReplyDelete