శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ మహిమ, ఓ భక్తురాలి అనుభవం!

శ్రీసాయినాథాయనమః 
"శ్రీసాయిలీలలను అలవోకగా విన్నను ఆధ్యాత్మజీవితమందు శ్రద్ధ కలుగును. పాపములు నశించును. సాయిలీలలను ఇతరులకు చెప్పినచో నందు కొత్తవిషయములు గ్రహించగలరు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తిప్రేమలతోను,పూర్తి నమ్మకముతోను పారాయణముచేసి వారమురోజులలో ముగింతురో, వారియాపదలన్నియు నశించగలవు. ధనమును కోరిన పొందవచ్చును,వర్తకుల వ్యాపారము వృద్ధినొందును. శ్రీసాయి ప్రీతిచెంది యజ్ఞానమును పేదరికమును నిర్ములించి జ్ఞానము ఐశ్వర్యముల నొసంగును. రోగులు ఆరోగ్యవంతులగుదురు. వారిమనసులందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. భక్తుడు సాయిని శరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును."   శ్రీసాయిసచ్చరిత్రము

ఓ భక్తురాలి అనుభవం! 

హ్యూస్టన్ లోని నాకు తెలిసిన  ఓ భక్తురాలి ( గోప్యం కోసం  పేరు చెప్పుటలేదు) శ్రీసాయిసచ్చరిత్రము పారాయణ అనుభవము. ఆమెకు సాయిబాబానుగూర్చి పెద్దగా తెలియదు. ఓ సందర్భంలో కలిసినప్పుడు బాబాను గూర్చివిని, తన సమస్యల నివారణకై శ్రీసాయిసచ్చరిత్ర చదవాలనుకొంది. ఆమెవద్ద  సచ్చరిత్ర పుస్తకము లేకుండుటచె నానుండి ఇంగ్లీషు కాపి  తీసికెళ్ళింది. సాధారణంగా పారాయణ గురువారం మొదలుపెట్టి 7 రోజులు చేయాలని చెప్పాను. ఆమె శనివారం పుస్తకం తీసికెళ్ళి , గురువారం వరకు వేచియుండలేక ఆరోజే పారాయణ మొదలుపెట్టింది. పారాయణలో అభిరుచి, ఉత్సాహం పెరగటంతో మూడురోజులలోనే  పారాయణ పూర్తిచేసినది.  ఆఖరిరోజున చివరి పేజీలు  చదువుచున్నపుడు ఇంట్లోని ఫోను మ్రోగనారంభించింది. కాని పుస్తకం పూర్తికానిదె ఫోన్ వద్దకు వెళ్ళగూడదని చదవడం కొనసాగించింది. ఫోన్ రింగింగ్  కూడా అలానే కొనసాగింది.

చివరకు చదవడం పూర్తయ్యాక ఫోన్ కాల్ తీసుకొంది. విషయం తెలిసాక ఆశ్చర్యానికి హద్దులేదు. ఎప్పటినుండో జాబ్ లేకుండ నిరాశతో  యున్న ఆమెకు జాబ్ ఆఫర్ ఆ ఫోన్ కాల్ లోని విషయం. పారాయణ ఫలితమే నని ఆమె నమ్ముతోంది. 

ఆపై బాబా భక్తురాలిగ మారి వారింట్లో బాబా పూజాసత్సంగాలు చేయడం ప్రారంభించింది. ఈ సంఘటన షుమారు 16 యేండ్ల పూర్వం జరిగింది. పారాయణ మహిమకు దేశ కాలాలతో పనిలేదు. భక్తిశ్రద్ధలతో, పట్టుదలతొ , బాబాపై నమ్మకంతో చేసేవారికి తప్పక బాబా అనుగ్రహం లభిస్తుందనడానికి పై అనుభవం ఓ నిదర్శనం. 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!       

         

Comments

  1. శ్రీసాయిసచ్చరిత్ర పరాయణ చేసి అందరు శ్రీసాయినాథుల అనుగ్రహమును పొందెదరుగాక!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!