సాయి నందలాల!
సాయి నందలాల
నందలాల
నందలాల
నందలాలా ...ఆనందలాల
నందలాలా ...ఆనందలాల
నందలాల
నందలాల
నందలాలా ...సాయినందలాల
నందలాలా ...సాయినందలాల
బృందావనమున నందలాలా
గోకులము
వెలసెనమ్మ నందలాల
ఆ గోకులమందున నందలాల
బాలగోపాల
లీల నందలాల || నందలాల ||
షిరిడీ
పురమునా నందలాల
ద్వారకామాయి
నిలచె నందలాల
ఆ ద్వారకామాయిలోన నందలాల
షిరిడిసాయి
లీలచూడు నందలాల || నందలాల ||
గోపికల
ఇండ్లలోన నందలాల
వెన్నదొంగిలించెనమ్మ
నందలాల
ఆ... వెన్నముద్దలతోటి నందలాల || నందలాల ||
గోపికల
మనసుదోచె నందలాల
పిచ్చుకలుగ
తనవారల నందలాల
బహుపాశమేసి
పట్టిలాగు నందలాల
ఆ... పాశా బంధముతో నందలాల
ఆశపాశము
తొలగే నందలాల || నందలాల ||
పోతానా
హతమార్చె నందలాల
కాళీయుని
మర్థించె నందలాల
తనదు చిన్ననోటిలోనే నందలాల
విశ్వమంత
జూపించె నందలాల || నందలాల ||
గోధుమల
పిండిజేసి నందలాల
రోగముల
రూపుమాపె నందలాల
రూపులెన్నొ
తానుజూపి నందలాల
విశ్వరూపు
తానాయె నందలాల || నందలాల ||
గోవర్ధనంబెత్తి నందలాల
గోపాలుర గాచెనమ్మ
నందలాల
అసురులెల్ల
వధియించి నందలాల
ఆత్మీయుల
గాపాడె నందలాల || నందలాల ||
భక్త బరువు భారమెత్తి నందలాల
భోగభాగ్యము
గూర్చే నందలాల
అలజడులా
మనసు నణచి నందలాల
పరమ శాంతుల
నింపే నందలాల || నందలాల || |
పగ్గములా
తాబూని నందలాల
పార్థసారధి
తానే నందలాల
గీతాసారముతోడి
నందలాల
విజయునకు
విజయమాయె నందలాల || నందలాల ||
జీవనావ
సరంగే నందలాల
మార్గదర్శి
వాడె వాడె నందలాల
మనసిచ్చి
ముడివడరె నందలాల
జయమునిచ్చు జనమగూర్చు
నందలాల ... సాయి నందలాల || నందలాల ||
నందలాల ... సాయి నందలాల || నందలాల ||
సాయిబాబా బూటీవాడాలో భక్తుల కరుణించెడి మురళీధరుడు!
ReplyDelete