సాయి నందలాల!

శ్రీసాయినాథాయనమః 

సాయి నందలాల
నందలాల నందలాల
నందలాలా ...ఆనందలాల
నందలాల నందలాల
నందలాలా ...సాయినందలాల

బృందావనమున  నందలాలా
గోకులము వెలసెనమ్మ నందలాల
గోకులమందున నందలాల
బాలగోపాల లీల నందలాల                    || నందలాల ||

షిరిడీ పురమునా నందలాల
ద్వారకామాయి నిలచె నందలాల
ద్వారకామాయిలోన నందలాల
షిరిడిసాయి లీలచూడు నందలాల        || నందలాల ||

గోపికల ఇండ్లలోన నందలాల
వెన్నదొంగిలించెనమ్మ నందలాల
... వెన్నముద్దలతోటి నందలాల        || నందలాల ||
గోపికల మనసుదోచె నందలాల            

పిచ్చుకలుగ తనవారల నందలాల
బహుపాశమేసి పట్టిలాగు నందలాల
... పాశా బంధముతో నందలాల
ఆశపాశము తొలగే నందలాల                || నందలాల ||

పోతానా హతమార్చె నందలాల
కాళీయుని మర్థించె నందలాల
తనదు చిన్ననోటిలోనే నందలాల
విశ్వమంత జూపించె నందలాల              || నందలాల ||

గోధుమల పిండిజేసి నందలాల
రోగముల రూపుమాపె నందలాల   
రూపులెన్నొ తానుజూపి  నందలాల
విశ్వరూపు తానాయె నందలాల             || నందలాల ||   

గోవర్ధనంబెత్తి    నందలాల
గోపాలుర  గాచెనమ్మ నందలాల
అసురులెల్ల వధియించి నందలాల
ఆత్మీయుల గాపాడె నందలాల               || నందలాల ||   

భక్త బరువు భారమెత్తి  నందలాల
భోగభాగ్యము గూర్చే నందలాల
అలజడులా మనసు  నణచి నందలాల
పరమ  శాంతుల నింపే నందలాల           || నందలాల ||        |

పగ్గములా తాబూని నందలాల
పార్థసారధి తానే నందలాల
గీతాసారముతోడి నందలాల
విజయునకు విజయమాయె నందలాల   || నందలాల ||     

జీవనావ సరంగే  నందలాల
మార్గదర్శి వాడె వాడె నందలాల
మనసిచ్చి ముడివడరె నందలాల
జయమునిచ్చు  జనమగూర్చు
 నందలాల ... సాయి నందలాల               || నందలాల ||                    

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!




Comments

  1. సాయిబాబా బూటీవాడాలో భక్తుల కరుణించెడి మురళీధరుడు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!