బాబా బాబా బాబాసాయ్!
శ్రీసాయినాథాయనమః
బాబా బాబా బాబా సాయ్ , బాబా శిరిడీ బాబాసాయ్
సాయి సాయి బాబా సాయ్ , సాయి శిరిడీ బాబా సాయ్
దారీదప్పిన
గుఱ్ఱాన్ని , పాటిల్‌కు చూపాడోయ్
నీరునిప్పు
పుట్టించి చిలుము
చేత బట్టాడోయ్
పెళ్ళివాళ్ళ
బళ్ల మీద షిరిడీకి
వెళ్లాడోయ్
కళ్యాణము
జెయలోకానికి ద్వారకమాయి
చేరాడోయ్ ||బాబా బాబా
బాబాసాయ్||
ఊరివాళ్ళు
నూనె నివ్వక నీళ్లతొ దీపాలుంచాడోయ్
కానివాళ్ళు
లేనివాళ్ళుగ అందరి
బాగు చూసాడోయ్
తిరుగలిలోన
గోధుమలేసి గీరాగీర
తిప్పాడోయ్
రోగుల
బాధల ఆర్తుల పీడల తుత్తునియల జేసాడోయ్ ||బాబా బాబా
బాబాసాయ్||
రామునిపూజలు
జేసాడోయ్, అల్లా మాలిక్ అన్నాడోయ్
ధూని
విభూతితోడ లీలలెన్నొ
జూపాడోయ్
పెద్ద
పెద్ద పాత్రల్లోన పంచభక్ష్యా లొండాడోయ్
చిన్నాపెద్ద
తేడాలేక అందరీకి
పంచాడోయ్ ||బాబా బాబా బాబాసాయ్||
దక్షిణ
పైసల బట్టాడోయ్ భక్తుల రక్షణ జేసాడోయ్
భిక్షకు
వీధుల తిరిగాడోయ్ కరమల దూరం జేసాడోయ్
పిల్లాపాపలు లేనివారల
కడుపు పండగ జేసాడోయ్
తల్లీతండ్రీ
దూరమైతె తానే
అండని అన్నాడోయ్ ||బాబా బాబా బాబాసాయ్||
భూమివిడచి
మూడు రోజులు సొరగం చూడగ వెళ్లాడోయ్
ఆ సొరగం మనకు చూపగా
మరలి మరలి వచ్చాడోయ్
కన్నులా
ఎఱ్ఱగజేసి తూఫాన్ పోకడ ఆపాడోయ్
ఎడమచేతి
సైగలతోటె ధూనినిప్పు దింపాడోయ్ ||బాబా బాబా బాబాసాయ్||
మంచి
మంచి మానసాదే మతముల సారమన్నాడోయ్
రేయీ పగలు, చేరినవాళ్లకు సంపదనంతా పంచాడోయ్
మనుషుల పశువుల పక్షుల లోని వెలుగు ఒకటే నన్నాడోయ్
మనుషుల పశువుల పక్షుల లోని వెలుగు ఒకటే నన్నాడోయ్
కలిమీ
లేములు కావడి కుండలు చూడు
చూడ మన్నాడోయ్ ||బాబా
బాబా బాబాసాయ్||
మేడాలొద్దు
మిద్దెలొద్దు శ్రద్ధా సహనము అడిగాడోయ్
అన్నీవిడచి
తన్నేజేరిన తానె అన్నీ అన్నాడోయ్
సన్నాకొసల
బల్లపైన భళిరా బాగా వూగాడోయ్
చావడి
సంబర వేళల, కోటి సూర్యుల జూపాడోయ్ ||బాబా బాబా బాబాసాయ్||
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
శిరిడీ చరిత్రలో డిసెంబరు 10 వ తారీఖునకు ఓ ప్రత్యేకత కలదు. ఆరోజు 1910 వ సంవత్సరములో చావడిలొ రాత్రి ఆరతివేడుక ప్రారంభమైనది. అదేరోజున ఖాపర్డే తన యింటికి వెళ్ళుటకు బాబా యనుమతి లభించెను. ఆరోజుననే కాకాసాహెబు నిర్మించిన దీక్షితు వాడకు శంకుస్థాపన జరిగినది. చావడి ఉత్సవము నేటికిని ప్రతిగురువారము షిరిడీలో చాల వేడుకగా కొనసాగుతున్న విషయము భక్తులకు విదితమే.
ReplyDelete