ఎక్కడివాడు? Where is this Lord, O Sai?

శ్రీసాయినాథాయనమః 

ఎక్కడి వాడమ్మా!
ఎక్కడి వాడమ్మా....   ఎక్కడివాడు?
రెండక్షరాల చక్కనివాడు
సాయినామముతోడ మదినిండినాడు
ఇంతింతై....  వటుడింతై .... ఎదిగిపొయాడు

పాతమజీదున   పదమూని నాడు
పేదసాదల...  ఎదజేర్చినాడు 
దేశదేశాల...  ఏలుతున్నాడు ||2||
కోట్ల దాసుల  చేయుచున్నాడు
కోటాను, కోట్ల దాసుల  జేయుచున్నాడు                             || ఎక్కడి వాడమ్మా||

షిరిడి  వీధుల బిచ్చమెత్తాడు
చిరుగు జోలెలో భిక్ష పట్టాడు
జాలిగుండెతో   జగము నేలాడు || 2||
పేదోళ్ల గొప్పోళ్ళ దేవుడైనాడు
పేద, పేదోళ్ల గొప్పోళ్ళ  దేవుడైనాడు                                   || ఎక్కడి వాడమ్మా||

రెండు రూకల దక్షిణడిగాడు
శ్రద్ధసహనాలె చూపమన్నాడు
సబ్ మాలిక్ ఏక్ అన్నాడు ||2||
కన్నుకలిపితే  కలిమినిస్తాడు
కను , కన్నుకలిపితే కలిమినిస్తాడు                                   || ఎక్కడి వాడమ్మా||

ధునివెలిగించాడు, కర్మల కాల్చాడు
వీభూతి పంచాడు  వీభూతులిచ్చాడు
ఎన్నెన్నొ రూపాల వెలుగు తున్నాడు ||2||
కన్నుకప్పి  మరి, తప్పుకుంటాడు
అరె , కన్నుకప్పి మరి తప్పుకుంటాడు                             || ఎక్కడి వాడమ్మా||

లీలలెన్నొ అవ , లీలగ జూపాడు
ఆలన పాలన, తానుగ నిలిచాడు
సాయి సాయంటే, సాయమౌతాడు ||2||
ఆర్తితొ బిలిచిన , ఆదుకొంటాడు
ఆర్తి, ఆర్తితొ బిలిచిన ఆదుకొంటాడు,
బంధువౌతాడు.... ఆత్మ బంధువౌతాడు                            || ఎక్కడి వాడమ్మా|| 

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



Where Is This Lord, O Sai? December 18, 2025 Śrī Sāyināthāya Namaḥ Where is this Lord, O Sai? Where is this Lord… where could He be? A Name of just two syllables, Yet it fills the mind with endless bliss. Little by little… step by step… He has grown, He has risen. In the old Masjid, He walked humbly, Raised the poor with gentle care, And His fame spread far and wide. He blesses millions of devotees, And countless devotees bow to Him. (Where is this Lord, O Sai?) On Shirdi streets, He begged for alms, In humble bowls He received the gift; With a generous heart, He held the world. To the poor, to the great—He is God, The God of all, both rich and poor. (Where is this Lord, O Sai?) He asked for but two coins, And showed patience and devotion. “To all, I am the One Master,” He said. When eyes meet, hearts unite, When eyes meet, hearts truly unite. (Where is this Lord, O Sai?) He lit the lamps, purified the karmas, Gave sacred ash to all, And revealed Himself in many forms. Yet when He hides, He escapes the grasp, Ah! When He hides, He escapes the grasp. (Where is this Lord, O Sai?) His leelas are endless, a joy to behold, He rules the hearts, yet stands apart. When one calls “Sai,” He answers: To the suffering, He comes to aid, To the suffering, He comes to aid, He becomes a friend… a soul’s companion. (Where is this Lord, O Sai?) May Śrī Sai’s rays of compassion Shine upon all beings! May auspiciousness bless everyone! Om Sai, Śrī Sai, Jaya Jaya Sai! 🌺🙏

Comments

  1. " మూడడుగులు దానమడిగి ముల్లోకములు నిండినాడు వామనుడు, రెండురూకల దక్షిణ పొంది నా హృదయమంత పొంగినాడు సాయినాథుడు! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!