సాయిస్వప్నము
శ్రీసాయినాథాయనమః సాయి స్వప్నము స్వప్నమైనది సాయి స్వప్నమైనది బ్రహ్మ ముహూర్తవేళ స్వప్నమైనది వేలభాను కాంతులేమొ నింగినిండెను మంద మలయ పవనమేమొ హాయిగొలిపెను సాయిపాద కమలమేమొ కనులనిలచెను మనసు నాట్యమయూరియై జగము మరచెను || స్వప్నమైనది || ధుని ధునిలో పొగలేమో పలుచనాయెను జలదివ్వెల జిలుగులేమొ రెపరెపాడెను గురుదేవుల తేజమేమొ కనుల దోచెను చిరునవ్వుల చిన్మయుడే ముందు నిలచెను || స్వప్నమైనది || భస్మముతొ సద్గురువు కొలువు దీరెను భక్తులతొ ద్వారకమయి పొంగిపోయెను హారతుల జాగరణల హోరు పెరిగెను మందగతుల తనువేమొ చిందువేసెను || స్వప్నమైనది || కర...